: ఐదు నిమిషాల్లోపే బెయిల్ మంజూరు... స్వామి షరతుల తిరస్కరణ


నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు స్వయంగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కుమారుడు రాహుల్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఆ క్షణం ఈ మధ్యాహ్నం రానే వచ్చింది. మొన్నటి వరకు దేశాన్ని కనుసైగలతో శాసించిన సోనియాగాంధీ కోర్టు మెట్లెక్కారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. అయితే, కనీసం ఐదు నిమిషాలు కూడా గడవక ముందే కేసు నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సాధారణ బెయిల్ ఇవ్వకూడదని, కండిషన్లతో కూడిన బెయిల్ ఇవ్వాలని ఈ సందర్భంగా బీజేపీ నేత, పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి కోర్టును కోరారు. వారి ప్రయాణాలపై షరతులు విధించాలని, పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని విన్నవించారు. అయితే, స్వామి విన్నపాలను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పు అనంతరం స్వామి వ్యవహారంపై కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, స్వామి తీరును తప్పుబట్టారు. మన సమాజంతో పెనవేసుకుపోయిన వ్యక్తులకు సంబంధించిన పాస్ పోర్టుల గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు. వాస్తవానికి ఇది ఏమాత్రం ప్రాధాన్యత లేని కేసు అని... మీడియానే దీన్ని పెద్దది చేసి చూపిందని చెప్పారు.

  • Loading...

More Telugu News