: మంగళగిరి ఎయిమ్స్ కు రూ.4 కోట్ల విరాళం
గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు శంకుస్థాపన చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి పలువురి నుంచి విరాళాలు వచ్చాయి. మొత్తం రూ.4 కోట్ల విరాళాలను దాతలు ప్రకటించారు. ఈ మొత్తంంలో డా.కాసరనేని సదాశివరావు కుటుంబం నుంచి రూ.2 కోట్లు, డా.చిగురుపాటి నాగేశ్వరరావు కుటుంబం నుంచి రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు వారు తెలిపారని సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మొత్తాన్ని త్వరలో వారు సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు.