: మంగళగిరి ఎయిమ్స్ కు వాజ్ పేయి పేరు: చంద్రబాబు


మంగళగిరి ఎయిమ్స్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెడదామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాజ్ పేయి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నానని చెప్పారు. ఎయిమ్స్ కు శంకుస్థాపన చేసిన అనంతరం, బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. ఎయిమ్స్ కు ముందు మరో ఏ (అటల్) చేర్చాలనే అంశం తెరపైకి వచ్చిందని... ఈ విషయాన్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News