: బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది: ఆజాద్


ఢిల్లీ పాటియాలా కోర్టులో నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో ఈ మేరకు ఆ పార్టీ సినియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాగే అరుణాచల్ ప్రదేశ్ లో గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని గద్దె దింపే యత్నం చేశారన్నారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడంలో విఫలమయ్యారని చెప్పారు. అధికారంలోకి రాకముందు 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అజెండా అన్న బీజేపీ, అధికారంలోకి వచ్చాక 'విపక్ష్ ముక్త్ భారత్' అజెండాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం, విపక్షాలనే మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని, అయితే, తాము పార్లమెంటు నుంచి గల్లీ వరకు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆజాద్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News