: సోమవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీ


ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు సభ ప్రారంభమయినప్పటి నుంచి వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు. రోజాను సస్పెండ్ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ, సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుమార్లు సభను వాయిదా వేశారు. అయినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కోడెల ప్రకటించారు.

  • Loading...

More Telugu News