: రాష్ట్ర విభజన తరువాత నుంచే ఎయిమ్స్ పై దృష్టి పెట్టా: వెంకయ్య నాయుడు


దేశంలో ఎవరికి ఏ రోగం వచ్చినా అందరూ ఎయిమ్స్ ఆసుపత్రికే వస్తారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు, ప్రధానమంత్రి సహా ఢిల్లీలోని ఎయిమ్స్ కే వెళతారని తెలిపారు. అందుకే రాష్ట్ర విభజన తరువాత నుంచి తాను ఎయిమ్స్ పై దృష్టి పెట్టానని చెప్పారు. దానికోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దాను తాను ఓ 15 సార్లు కలసి ఇబ్బంది పెట్టి ఉంటానని వివరించారు. ఓసారైతే ప్రధానమంత్రి ముందుకు ఎయిమ్స్ అంశాన్ని తీసుకెళ్లగానే కేబినెట్ లో పెట్టి ఆమోదం తెలిపారని వెల్లడించారు. అటువంటి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఏర్పాటు కావడం ఎంతో సంతోషదాయకమని వెంకయ్య పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణం కాబోతున్న ప్రాంతం కూడా ఎంతో మంచిదని, తనకు ఇప్పుడే భవిష్యత్తు కనపడుతోందని చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News