: రోజాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలి: చెవిరెడ్డి
తమ ఎమ్మెల్యే రోజాకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. రోజాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్ల ఆమె గాయపడ్డారని... పోలీసులు ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రోజా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే... చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే అధికారపక్ష ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా, ఆయన ఏమీ అనడం లేదని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా మాట్లాడుతుంటే, చంద్రబాబు ఆనందిస్తున్నారని విమర్శించారు.