: అసెంబ్లీ ఆవరణలో కిందపడ్డ రోజా... అరెస్ట్ చేసిన పోలీసులు, నాంపల్లి పీఎస్ కు తరలింపు


సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నేటి ఉదయం మళ్లీ అసెంబ్లీ ఆవరణలో హల్ చల్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయినా ఆమె నేటి ఉదయం అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీఎల్పీ భవనంలోకి వెళ్లేందుకు యత్నించారు. సస్పెన్షన్ నేపథ్యంలో గేటు వద్దే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను సభలోపలికి వెళ్లడం లేదని, అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీఎల్పీ కార్యాలయంలోకి వెళుతున్నానని చెప్పి ముందుకు కదిలారు. దీంతో రంగప్రవేశం చేసిన మార్షల్స్ అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. ఈ సందర్భంగా మార్షల్స్ తో రోజా వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా వెనుదిరగకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రోజా కిందపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పోలీస్ వాహనంలోకి ఎక్కేందుకు ససేమిరా అన్న రోజా, తన వాహనంలో పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పారు. అందుకు అంగీకరించని మార్షల్స్ ఆమెను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించారు. అసెంబ్లీకి సమీపంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించారు.

  • Loading...

More Telugu News