: కాల్ మనీపై బీజేపీ తీర్మానానికీ తిరస్కారం... ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. విజయవాడలో వెలుగు చూసి, రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకున్న కాల్ మనీ దందాపై బీజేపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు విపక్షాల్లాగా తాము అనవసర రాద్ధాంతం చేయడానికి రాలేదని, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కాల్ మనీపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సభా నాయకుడు, సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రత్యేకించి చర్చకు అనుమతించలేమని స్పీకర్ తేల్చిచెప్పారు.