: మంగళగిరి ఎయిమ్స్ కు నేడు శంకుస్థాపన... చంద్రబాబు సహా కేంద్ర మంత్రుల హాజరు


ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు నేడు పునాది రాయి పడనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. మొత్తం కేంద్ర నిధులతోనే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటు కానుంది. శంకుస్థాపనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సహా ఏపీ కేబినెట్ మంత్రులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News