: భారత్ చిత్రపటాన్ని మైక్రోసాఫ్ట్ తప్పుగా చూపిస్తోంది!: బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్


మైక్రోసాఫ్ట్ తో బాటు, అమెరికాకు చెందిన ఏజెన్సీలు భారత దేశ చిత్ర పటాన్ని తప్పుగా చూపిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనదేశంలో ఉండాల్సిన అక్సాయ్ చిన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని చైనా, పాకిస్థాన్ లో ఉన్నట్లుగా మ్యాప్ లను ఆయా సంస్థలు ముద్రించాయని ఆయన మండిపడ్డారు. భారతదేశ సర్వాధికారంపై జరుగుతున్న పరోక్షదాడికి ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన రాజ్యసభ జీరో అవర్ లో పేర్కొన్నారు. ఒక నెల క్రితం తాను నాటో సమావేశాల నిమిత్తం బ్రస్సెల్స్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు ఈ తప్పుడు మ్యాప్ ను చూపించారని అన్నారు. అప్పుడు ఈ మ్యాప్ కరెక్టు కాదన్న విషయాన్ని వారికి చెప్పానని.. ఖండించానని..భారత్ కు మిత్రులు అని భావిస్తే కనుక ఆ మ్యాప్ ను తనకు చూపవద్దని ఆ అధికారులకు సూచించానని చెప్పారు.

  • Loading...

More Telugu News