: 'వీరప్పన్' సినిమా కోసం ఎదురు చూస్తున్నా: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, రాంగోపాల్ వర్మ ఒకరిని ఒకరు పొగుడుకోవడంలో ముందుంటారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రశంసించుకోవడం, ఆయా సినిమాల్లోని నటీనటుల నటనను ఆకాశానికెత్తడం చేస్తుంటారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్' సినిమాపై రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరీ జగన్నాథ్ వంతు వచ్చింది. రాంగోపాల్ వర్మ తీస్తున్న 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. కాగా, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా శాండల్ వుడ్, బాలీవుడ్ నటులను టాలీవుడ్ కి వర్మ పరిచయం చేస్తున్నాడు. వీరి ప్రతిభపై పూరీ ఏ రకంగా ప్రశంసలు కురిపిస్తాడో చూడాలి.