: లక్ష్యం మేమైతే...మీకు సురక్షిత ప్రదేశం అన్నదే లేకుండా చేస్తాం: ఉగ్రవాదులకు ఒబామా వార్నింగ్
మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటే...మీరు సురక్షితంగా ఉండడానికి నేల లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గర్జించారు. వర్జీనియాలో కౌంటర్ టెర్రరిజం సెంటర్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా ఉగ్రవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మీరు ఎక్కడున్నా గుర్తించగలమని అన్నారు. అమెరికన్లను అమెరికా కాపాడుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అమెరికా నిఘా విభాగం, కౌంటర్ టెర్రరిజం విభాగం వద్ద ఉగ్రదాడులకు సంబంధించిన నిర్దిష్టమైన విశ్వసనీయ సమాచారం ఏదీ లేదని ఆయన చెప్పారు. అయితే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకు అంతా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.