: 'దిల్ వాలే' సినిమా చూడొద్దంటూ హిందూసేన ఆందోళన
బాలీవుడ్ రొమాంటిక్ పెయిర్ షారూఖ్ ఖాన్, కాజోల్ లతో బాటు, వరుణ్ ధావన్, కృతి సనాన్ మరో జంటగా ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన 'దిల్ వాలే' సినిమాకు నిరసనల సెగ తగిలింది. నేడు ఈ సినిమా విడుదలైంది. ఈమధ్య షారూఖ్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలకు గానూ సినిమాను ఎవరూ తిలకించవద్దంటూ హిందూ సేన ఆందోళన నిర్వహించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 'దిల్ వాలే' విడుదలైన సినిమా థియేటర్లవద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా హోర్డింగులు ధ్వంసం చేశారు. ఈ సినిమాను ఎవరూ ఆదరించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సినిమా హాళ్ల వద్ద పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.