: శాసనసభ రేపటికి వాయిదా
ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా పడింది. తొలిరోజు వాయిదాల పర్వంతో ముగిసిన శాసనసభ రెండోరోజు ఆసక్తికరంగా సాగింది. అంబేద్కర్ పై చర్చకు సహకరించడం లేదంటూ ఉదయం సెషన్ ను ప్రతిపక్షం లేకుండా కొనసాగించిన సభాపతి, రెండో సెషన్ లో అత్యంత ఓపిక వహించారు. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు, ఆవేశకావేషాలు, నిందారోపణలు, ఆందోళన, నిరసన, అరుపులు, వ్యంగ్యవ్యాఖ్యలను సహనంతో భరించారు. కాల్ మనీ నేపథ్యంగా సాగిన చర్చను ఆసాంతం నిర్వహించారు. సమయం మించిపోవడంతో శాసనసభను రేపటికి వాయిదా వేశారు.