: అడ్డుకున్న మార్షల్స్... కన్నీరుపెట్టిన రోజా!
ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి పెట్టారు. సస్పెండ్ అయిన అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా మార్షల్స్ అడ్డుకోవడంతో రోజా కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే, అక్కడి నుంచి వెళ్లిపోయారు.