: అధికార పక్ష సభ్యులు నాపై పగబట్టారు: ఎమ్మెల్యే రోజా


అధికార పక్ష సభ్యులు తనపై పగ బట్టారని, అందుకే అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేశారని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘అసెంబ్లీలో స్లోగన్స్ ఇవ్వడం తప్పా?’ అని ఆమె ప్రశ్నించారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని, తనను ఎదుర్కోలేకనే సస్పెండ్ చేశారంటూ టీడీపీ సర్కార్ పై రోజా మండిపడ్డారు. కాగా, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడి వ్యాఖ్యలతో ఈరోజు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News