: ‘వరద’ గ్రామాల దత్తతకు సిద్ధంగా నటుడు సూర్య


తమిళనాడులోని వరద బాధిత గ్రామాలను దత్తత తీసుకున్న వారి జాబితాలో దక్షిణాది నటుడు సూర్య చేరనున్నారు. తిరువాల్తూరు జిల్లాలోని నెల్వాయి, కలాచుర్, కెరగమ్ బాకమ్ గ్రామాలను ఆయన దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. వరదల కారణంగా ఈ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ మూడు గ్రామాల్లో ఇరుళా కుటుంబాలకు చెందిన వారు నివసిస్తుంటారని చెప్పారు. ఈ కుటుంబాల వారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవని, దాంతో అధికారికంగా వారికి సాయం అందదని, పిల్లలకు పోషకాహారం తినలేని పరిస్థితులు నెలకొన్నాయని ఒక ప్రకటనలో నటుడు సూర్య పేర్కొన్నారు. కాగా, చెన్నైలోని కొట్టు పురంలోని సూర్యనగర్ ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం దత్తత తీసుకున్నారు.ఈ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తన భార్య సుహాసిని, ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటాయని మణిరత్నం పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News