: ఈ పాత కారు ధర వింటే కళ్లు తిరగాల్సిందే!


ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది ఓ పాత కారు. ఎందుకూ పనికి రాదనుకున్న ఈ వింటేజ్ కారు ఏకంగా 185 కోట్ల రూపాయల ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1956లో ప్రముఖ ఫార్ములా వన్ రేసర్ జాన్ మాన్యుయెల్ ఫాంగియో కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న 290 ఎంఎం ఫెరారీ కారును ప్రముఖ ఆక్షన్ హౌస్ 'సౌత్ బే' వేసిన వేలంలో ఓ వ్యక్తి 28 మిలియన్ డాలర్లకు (185 కోట్ల రూపాయలు) కొనుగోలు చేశారు. 290 ఎంఎం శ్రేణిలో ఫెరారీ కేవలం నాలుగు కార్లనే తయారు చేయగా, ఆ నాలుగింటిలో ఒకటి ఈ కారు. అందుకే ఈ ధర పలికిందని 'సౌత్ బే' తెలిపింది.

  • Loading...

More Telugu News