: రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు... అసెంబ్లీలో అడుగుపెట్టరాదంటూ ఆదేశం


వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు పడింది. ఏడాది పాటు అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో రోజాపై వేటు పడింది. అంతకు ముందు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలంటూ మంత్రి యనమల ప్రతిపాదించారు. యనమల ప్రతిపాదనకు ఓకే చెప్పిన స్పీకర్... వెంటనే రోజాను సస్పెండ్ చేశారు. ఈ మధ్యాహ్నం సభలో రోజా మాట్లాడుతూ, చంద్రబాబును ఉద్దేశించి కాల్ మనీ చంద్రబాబు, సెక్స్ రాకెట్ చంద్రబాబు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

  • Loading...

More Telugu News