: పగలబడి నవ్విన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖంలో నవ్వును మనం అరుదుగా చూస్తుంటాం. అలాంటి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు పగలబడి నవ్వారు. శాసనసభ వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లుతున్న వేళ చంద్రబాబు నాయుడును అంతలా నవ్వించిన అంశం ఏంటంటే...కాల్ మనీ అంశంపై సీఎం స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్ మెంట్ ను మధ్యలో అడ్డుకున్న వైఎస్సార్సీపీ వాడీవేడిగా విమర్శలు చేసింది. దీంతో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 'మెంటలోడు, సైకో' అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి జగన్ ఆవేశంగా సమాధానమిస్తూ, శాసనసభ రూల్స్ మార్చేస్తున్నారని, స్టేట్ మెంట్ ఇచ్చాక ఎక్కడైనా, ఎన్నడైనా చర్చ జరిగిందా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబునాయుడు పగలబడినవ్వారు.

  • Loading...

More Telugu News