: ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్నా...లెక్కలు రాక సినీనటినయ్యా: సోనాక్షి సిన్హా


చిన్నప్పుడు తాను ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) నవ్వాలని భావించానని, అయితే గణితశాస్త్రం అర్థం చేసుకోవడంలో విఫలమవడం వల్ల సినీ నటినయ్యానని బాలీవుడ్ నటి సానాక్షి సిన్హా చెప్పింది. 'బార్న్ స్టైలిష్' కార్యక్రమంలో సోనాక్షి పలు విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు ఆటలన్నా ఇష్టమేనని, స్విమ్మింగ్ లో ప్రావీణ్యం ఉండడం వల్ల అందులో నైనా రాణించాలని భావించానని ఆమె వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుండగా, సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ 'దబాంగ్' సినిమాలో అవకాశం ఇచ్చారని, అలా తాను సినిమాల్లోకి వచ్చానని ఆమె వెల్లడించింది. 'దబాంగ్' సినిమా తరువాత ఇక సోనాక్షి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ప్రస్తుతం ఆమె 'అకీరా', 'ఫోర్స్-2' సినిమాల్లో నటిస్తోంది.

  • Loading...

More Telugu News