: రిజర్వేషన్లు, అవినీతి దేశాన్ని నాశనం చేస్తున్నాయన్న న్యాయమూర్తి... అభిశంసిస్తామని హెచ్చరించిన ఎంపీలు
ఇండియా నాశనం కావడానికి కారణం, దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లు, ఆపై లంచగొండితనమేనని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడాన్ని ఎస్సీ/ఎస్టీ పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. సదరు న్యాయమూర్తి వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించినట్టని, ఆయన్ను అభిశంసిస్తామని కేంద్ర మంత్రులు రాంవిలాశ్ పాశ్వాన్, తావర్ చంద్ గెహ్లాట్ లు హాజరైన ఓ సమావేశంలో ఎంపీలు హెచ్చరించారు. జస్టిస్ జేపీ పర్దీవాలా ఈ వ్యాఖ్యలు చేయగా, అందుకు నిరసనగా 23న బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఎంపీలు తెలిపారు. రాజ్యసభలో ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు బీజేపీ ఎంపీ ఉదయ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే 50 మంది ఎంపీల సంతకాలు తీసుకున్నామని తెలిపారు.