: వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరెస్టుపై హైకోర్టు స్టే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. విశాఖ మన్యంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఈశ్వరి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తల నరికేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమెపై పలువురు టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆమె కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఆమెను అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ, దర్యాప్తు చేసుకోవచ్చని మాత్రం పోలీసులకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ఈశ్వరి తెలిపారు.