: 'నిర్భయ' కేసులో బాల నేరస్థుడి విడుదలను అడ్డుకోలేం: ఢిల్లీ హైకోర్టు
దేశంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన కేసులో బాల నేరస్థుడి విడుదలను అడ్డుకోవాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ఓ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అతని విడుదలను తాము అడ్డుకోలేమని, జువనైల్ జస్టిస్ బోర్డ్ మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలదని పేర్కొంది. దాంతో విడుదల నిలుపుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో జువనైల్ నేరస్థుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు నిర్భయ కేసులో తమకు న్యాయం జరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.