: అసెంబ్లీ వద్ద జగన్ ను అడ్డుకున్న పోలీసులు!
అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.అనుమతి ఉన్నప్పటికీ తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ జగన్ పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు గేటు దూకి లోపలికి వెళ్లి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ బయట జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టరు బిఆర్ అంబేద్కర్ పై చర్చకు అడ్డుపడుతున్నారన్న కారణంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.