: కేసీఆర్ ఎర్రవెల్లిలో... కేటీఆర్ మెట్రో రైలులో!
తాను తలపెట్టిన అయుత మహా చండీయాగం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లికి వెళ్లిన వేళ, పలువురు మంత్రులు హైదరాబాద్ లోని నాగోల్ నుంచి మెట్టుగూడ వరకూ సిద్ధమైన మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ మధ్యాహ్నం కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు మెట్రో రైల్ ట్రయల్ రన్ లో ప్రయాణించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా పిలిచి రైలెక్కించి ఓ రౌండ్ తిప్పారు. ఆపై నాగోల్ స్టేషన్ లో రైల్వే నియంత్రణా వ్యవస్థ, పనితీరు, ప్రయాణికులకు సౌకర్యాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. తమతో పాటు ప్రయాణించిన వారు ఎలాంటి అనుభూతి పొందారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.