: యాగానికి అందరూ ఆహ్వానితులే... ఎలాంటి ఆంక్షలూ లేవు: కేసీఆర్
తాను చేపడుతున్న అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులేనని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న యాగం ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగనుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో ఈ యాగం జరుగుతోంది. యాగానికి సమయం ఆసన్నమవుతోంది. పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్ అక్కడి పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. యాగానికి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ రావొచ్చని, ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన ప్రకటించారు.