: అత్యుత్తమ వ్యాపార దేశాల్లో తొలి స్థానంలో డెన్మార్క్... 97వ స్థానంలో భారత్


వాణిజ్యం, ద్రవ్యపరమైన స్వేచ్ఛ, అవినీతి, హింస వంటి సవాళ్లను కట్టడి చేయటం వంటి ప్రమాణాల ఆధారంగా 'బెస్ట్ కంట్రీస్ ఆఫ్ బిజినెస్ ఇన్-2015' పేరుతో ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది. 144 దేశాలతో రూపొందిన ఆ జాబితాలో డెన్మార్క్ అత్యుత్తమ వ్యాపార దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ ఎక్కడో 97వ స్థానంలో ఉంది. అయితే కజకిస్తాన్, ఘనా దేశాల కంటే ఈ జాబితాలో భారత్ వెనకబడి ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల్లో ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇంకా పాతబడిన సొంత ఆర్థిక విధానాలనే అవలంబిస్తుండటం వల్లనే ఈ జాబితాలో వెనకబడిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇక 2009లో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అమెరికా ఆ తరువాత నుంచి ప్రతి ఏటా తన ర్యాంకును భారీగా కోల్పోతూ వస్తోంది. అలాగే ఇప్పుడు కూడా నాలుగు స్థానాలు చేజార్చుకుని 22వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 17.4 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచ ఆర్థిక రాజధానిగా అమెరికా వెలుగొందుతుండటం విశేషమని పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News