: అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్న జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ పై చర్చకు అడ్డుపడుతున్నారన్న కారణంతో ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. అసెంబ్లీ బయటి ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని తప్పుదారి పట్టించాలనే టీడీపీ ముందస్తు వ్యూహంతో తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు.