: ఐరాస అత్యవసర నిధికి భారత్ విరాళం


సహాయక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే భారత్ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. ప్రపంచంలో ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే ఆదుకునేందుకు ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి అత్యవసర నిధికి విరాళాన్ని ప్రకటించింది. 2015-16 సంవత్సరానికి గాను 5 లక్షల డాలర్లను (సుమారు 3 కోట్ల 32 లక్షలు) ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కు అందించనుంది. 2014లో కూడా ఇంతే మొత్తాన్ని భారత్ అందించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సేవల విభాగానికి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో స్పందించాల్సిన విషయాలలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News