: పుతిన్... అమరుడా? సర్వశక్తిమంతుడా? దేవుడా? లేక డ్రాక్యులానా?: ప్రపంచవ్యాప్తంగా చర్చ


మీరు చదివింది నిజమే. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పుతిన్ కు మరణమే లేదని, అతను అత్యంత శక్తిమంతుడని, పిశాచమని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు పుతిన్ ను దేవుడు అంటున్నారు. మరి కొందరు పుతిన్ ను డ్రాక్యులాగా భావిస్తున్నారు. లియొనార్డో డావిన్సీ పెయింటింగ్ మొనాలిసా అసలు రూపం పుతిన్ దే అని... ఆ పెయింటింగ్ వేసేముందు డావిన్సీ ముందు కూర్చున్నది పుతినే అంటూ మరి కొందరు చెబుతున్నారు. అసలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? దీనికి కారణ ఏమిటి? అనే సందేహం అందర్లోనూ కలగడం సహజం. ఎస్... ఈ చర్చకు కారణం రెండు ఫొటోలు. ఆ రెండు ఫొటోలే పుతిన్ పై పెద్ద చర్చను లేవనెత్తాయి. 1920లో ఒక రష్యా సైనికుడు తీయించుకున్న ఫొటోలో అతని పోలికలు అచ్చుగుద్దినట్టు పుతిన్ నే పోలి ఉన్నాయి. అప్పుడు ఆ యువ సైనికుడి వయసు పాతికేళ్లు అనుకున్నా... ఇప్పుడు అతని వయసు 120 ఏళ్లు ఉంటుంది. ఇలాంటిదే మరో ఫొటో. 1941లో మరో రష్యా సైనికుడు తీయించుకున్న ఫొటో కూడా పుతిన్ నే కాక, 1920లో యువ సైనికుడిని కూడా పోలి ఉంది. ఫొటోలలోని ఆ ఇద్దరు సైనికులు, రష్యా ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ ఒకే పోలికలతో ఉండటంతో... పుతిన్ కు మరణమే లేదనే వాదన పుట్టుకొచ్చింది. పెద్ద చర్చను లేవనెత్తింది. పుతిన్ పురాణ పురుషుడని ఈ పోలికలను నమ్ముతున్న వారంతా అంటున్నారు. పుతిన్ దేవుడని, సర్వశక్తిమంతుడని చెబుతున్నారు. మరికొంతమంది... సాక్ష్యాత్తూ 1431లో పుట్టిన డ్రాక్యులానే పుతిన్ (వ్లాద్ ది ఇంపేలర్) అని నమ్ముతున్నారు. గత జూన్ నెల నుంచి సోషల్ మీడియాలో మరో విషయం స్ప్రెడ్ అవుతోంది. లీసా ఘెరార్డిని కూడా పుతినే అని... ఆమె పెయింటింగ్ నే మొనాలిసాగా డావిన్సీ వేశాడనేదే ఆ విషయం. పుతిన్ డ్రాక్యులాగా బతికిన అనంతరం రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1500 ప్రారంభంలో మొనాలిసాగా పుతిన్ పెయింటింగ్ వేశారనేది వీరి వాదన. లేదా ఈ పెయింటింగ్ కోసం కాలధర్మానికి విరుద్ధంగా అతను వెనక్కి వెళ్లి ఉండవచ్చని కూడా కొందరి భావన. అయితే, పుతిన్ పై ఇంత చర్చ జరుగుతున్నా... ఏ ఒక్కటీ కూడా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. మనకు తెలిసిన పుతిన్ మాత్రం 63 ఏళ్ల రష్యా అధ్యక్షుడు. చొక్కా విప్పేసి వాయు వేగంతో హార్స్ రైడింగ్ చేయగలవాడు. స్పష్టమైన విధానాలతో, అద్భుతమైన వ్యూహరచనతో ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకడిగా గుర్తింపు పొందినవాడు.

  • Loading...

More Telugu News