: ఢిల్లీ ఎయిర్ పోర్టుపై అనుమానాస్పద డ్రోన్ చక్కర్లు... వివరాలు చెబితే లక్ష ఇస్తామని ప్రకటన
ఢిల్లీ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఓ డ్రోన్ అనేకసార్లు తిరుగుతుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అక్టోబర్ 27న ఓ డ్రోన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నాలుగైదు సార్లు కనిపించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఇలా ఎయిర్ పోర్టుపై తిరగడం వ్యతిరేక చర్య అవుతుంది. అంతేగాక ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ లతోనే రెక్కీలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. దాంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ క్రమంలో ఆ డ్రోన్ వివరాలు వెల్లడించిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.