: నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు కన్నుమూత


ప్రముఖ రంగస్థల, సినీ కళాకారుడు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శకుడు దాసరి నారాయణరావు సంతాపం తెలిపారు. 1931లో విజయవాడలో జన్మించిన చాట్ల, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, ఎన్టీఆర్ అవార్డులతో బాటు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రైల్వే ఉద్యోగిగా పని చేస్తూనే 1976 నుంచి నాటకరంగానికి ఆయన అంకితమయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో తొలి అనౌన్సర్ గా శ్రీరాములు పనిచేశారు. నాగార్జున,వెంకటేశ్ వంటి పలువురు సినీ నటులకు ఆయన అభినయంలో శిక్షణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News