: రూ. 39 వేల కోట్లతో శత్రు యుద్ధ విమానాలను గాల్లోనే పేల్చే మిసైళ్లు కొంటున్న ఇండియా


రష్యా నుంచి రూ. 39 వేల కోట్ల విలువైన మిసైళ్లను కొనుగోలు చేసే దిశగా ఇండియా మరో కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా శత్రు విమానాలను గాల్లోనే పేల్చేసే ఎస్-400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ భారత అమ్ముల పొదిలోకి రానుంది. తదుపరి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్న వేళ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ మిసైల్ వ్యవస్థను ఉపయోగించి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాలు, ఫైటర్ జట్ లు, మిసైళ్లు, డ్రోన్లు తదితరాలను నేలకూల్చవచ్చు. మొత్తం 5 సిస్టమ్ లను రష్యా నుంచి కొనుగోలు చేసి వాటిని దేశంలోని నలుమూలలా ఉంచాలన్నది కేంద్రం అభిమతం. వీటిల్లో లాంగ్ రేంజ్ రాడార్లు ఉంటాయి. ఒకేసారి పలు లక్ష్యాలను ఇది గుర్తించగలుగుతుంది. అమెరికన్లు వాడుతున్న అత్యాధునిక ఎఫ్-35 జెట్ యుద్ధ విమానాలు సైతం దీన్నుంచి తప్పించుకోలేవు. రష్యా నుంచి ఇదే మిసైల్ వ్యవస్థను సుమారు రూ. 19 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు చైనా సైతం డీల్ కుదుర్చుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News