: కేంద్రం దారికి రాని పార్టీల అంతు చూసే పనిలో సీబీఐ!.... కేజ్రీ సంచలన వ్యాఖ్య


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారికి రాని పార్టీల అంతు చూసే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్య కలకలం రేపుతోంది. తనతో మాట్లాడిన ఓ సీబీఐ అధికారే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని కూడా కేజ్రీ చెప్పారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయమని, అప్పటికీ దారికి రాని పార్టీల అంతు చూడమని కేంద్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని సదరు సీబీఐ అధికారి చెప్పారని కేజ్రీ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ అవినీతి అక్రమాలపై దాడులంటూ తననే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా విపక్ష పార్టీలను అంతం చేసేందుకూ వెనుకాడొద్దని ప్రభుత్వం సీబీఐకి ఆదేశాలు జారీ చేసిందన్న కేజ్రీ ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News