: మైసూర్ పాక్, పేడా, నెయ్యప్పమ్... వీటిలో ఏం పేరు పెట్టాలో అమ్మనడిగి చెబుతా: ఆండ్రాయిడ్ తదుపరి వర్షన్ పై సుందర్ పిచాయ్
ఆండ్రాయిడ్... గూగుల్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని వర్షన్లు మారుతున్నప్పటి నుంచి పలు రకాల స్వీట్లు, డెజర్ట్ ల పేర్లు పెడుతూ వస్తున్నారు. లాలీపాప్, జెల్లీబీన్, మార్ష్ మాలో... ఇలా. తదుపరి ఆండ్రాయిడ్ వర్షన్ కు ఓ ఇండియన్ మిఠాయి పేరు పెడతారా? పెట్టరా? ఢిల్లీ విద్యార్థులతో గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ సమావేశమైన వేళ ఎదురైన ప్రశ్న ఇది. ఆ వెంటనే సుందర్ 'ఏదో ఒక పేరు మీరే చెప్పండి' అని అడిగారు. వెంటనే మైసూర్ పాక్, పేడా, నెయ్యప్పమ్... అంటూ పలు పేర్లను విద్యార్థులు టకటకా చెప్పేశారు. అప్పటికప్పుడు ఏదో ఒక సమాధానాన్ని ఎంచుకోలేకపోయిన సుందర్, ఏ మిఠాయి పేరు పెట్టాలన్న విషయమై తన తల్లిని అడిగి చెబుతానని, ఆపై అత్యధిక భారతీయులు ఎంచుకునే పేరు కోసం ఎంపిక చేసిన స్వీట్స్, వంటకాల పేర్లను ఆన్ లైన్లో పోలింగ్ కు ఉంచుతామని చెప్పి విద్యార్థులను ఆనందపరిచారు.