: కోర్టుకు పోవాలి కాబట్టే ఇలా చేస్తున్నావా?: జగన్ పై అచ్చెన్నాయుడు విసుర్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా రభస కొనసాగుతోంది. తొలుత స్టేట్ మెంట్ ఇస్తామని, ఆపై చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించగా, ఏ రాష్ట్రంలోనూ లేని రూల్స్ పెడుతున్నారని, స్టేట్ మెంట్ తరువాత చర్చించేది ఏముంటుందని విపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ దశలో అసెంబ్లీలో అరుపులు, కేకలు పెరుగగా, అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. "నేడు శుక్రవారం. జగన్, ఆయనతో పాటున్న నిందితులు కోర్టుకు వెళ్లాలి. అందువల్లే గొడవలు జరిపి సభను వాయిదా వేసేలా చూసి, ఈ రూపంలో బయటకు వెళ్లాలని భావిస్తున్నారన్న అనుమానం వస్తోంది" అని అన్నారు. దీంతో విపక్ష ఎమ్మెల్యేలు పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.