: ఇడుగో.. విమానంలో నా పక్కనే బిన్ లాడెన్!: సిక్కు ప్రయాణికుడిపై అమెరికన్ చూపిన జాతి వివక్ష


విమానంలో తన పక్క సీటులో కూర్చున్న ఓ సిక్కు వృద్ధుడిని వీడియో తీసి, 'ఇతనే బిన్ లాడెన్' అంటూ ఓ అమెరికన్ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపతున్నారు. తన మానాన తాను నిద్రపోతున్న దర్శన్ సింగ్ అనే పేరున్న వృద్ధుడిని 39 సెకన్ల పాటు వీడియో తీసి, తాను బిన్ లాడెన్ తో ప్రయాణిస్తున్నానని, ఇక సురక్షితంగా ఉండగలరా? అని ఆ అమెరికన్ టైటిల్ పెట్టాడు. ఆపై యూట్యూబ్ లో దీనిని పోస్ట్ చేశాడు. గత నెలలో ఈ ఘటన జరుగగా, ఆ వ్యక్తి చేష్టలను ఖండిస్తూ, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇదే విషయాన్ని దర్శన్ కుమార్తె, యునైటెడ్ సిఖ్స్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కులపై జాతి వివక్ష చర్యలు పెరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News