: ప్రకాశం జిల్లా మావోల దగ్గర రాకెట్ లాంచర్లు!


ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ లో రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఏకే-47 తుపాకులు ఉన్నట్టు సమాచారం. దోర్నాల, ఎర్రగొండపాలెం రహదారిలో మావోల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు, కూంబింగ్ పార్టీతో కలిసి సోదాలు జరుపుతుండగా, ఈ డంప్ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలికి బయలుదేరారు. ఈ డంప్ లో ఏ మేరకు ఆయుధాలున్నాయన్న విషయమై పూర్తి సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News