: వివాదాస్పద అమెరికా రాజకీయ నేతకు రష్యా అధ్యక్షుడి మద్దతు


అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్స్ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని మద్దతు దొరికింది. డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలపై స్వదేశంలో పెను వివాదం రేగుతుండడం మనం చూస్తూనే వున్నాం. దీంతో ఆయన ఎప్పటికప్పుడు విమర్శలపాలవుతున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఆయనకు మద్దతు లభించింది. మాస్కోలో పుతిన్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అంతే కాదు, ట్రంప్ ప్రభావశీలి, ప్రతిభావంతుడు అని కొనియాడారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ లో మరికొంత మానసిక స్థైర్యాన్ని పెంచే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News