: అమెరికా అమ్ములపొదిలోకి లేజర్ అస్త్రాలు


అమెరికా ఆయుధాగారంలో శక్తమంతమైన లేజర్ ఆయుధాలు వచ్చి చేరనున్నాయి. అమెరికా నావికాదళంలో ఇప్పటికే లేజర్ ఆయుధాలు వాడకంలో ఉన్నాయి. అయితే ఇవి ఆకాశం నుంచి ప్రయోగించేంత శక్తిమంతంగా లేవని భావించిన అమెరికా వైమానిక దళానికి వాటిని అందజేయలేదు. మరింత అభివృద్ది చేసి, ఇప్పుడు వీటిని అమెరికా తన వైమానిక దళానికి అందజేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే శత్రువులకు చెందిన క్షిపణులు, డ్రోన్ లు, ప్రత్యేక విమానాలను గాల్లోనే కూల్చేయవచ్చు. 2020 నాటికి ఇవి పరీక్షల దశకు చేరుకుంటాయని, అయితే వీటిని యుద్ధవిమానాలకు అమర్చేందుకు మరింత చిన్నవిగా తయారు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే పెద్ద విమానాలకు వీటిని అమర్చేందుకు మరింత సమయం పట్టొచ్చని వారు వివరించారు.

  • Loading...

More Telugu News