: దొంగను పట్టిచ్చిన ప్రత్యక్షప్రసారం!


అమెరికాలోని రొచెస్టర్ నగరంలోని స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో సోమవారం నాడు దొంగతనం జరిగింది. ఈ సంఘటనపై ప్రత్యక్ష ప్రసారంలో ఓ కథనం ఇచ్చేందుకు కేఐఎంటీ-టీవీకి చెందిన రిపోర్టర్ ఆడమ్ సాలెట్ మంగళవారం నాడు ఆ బ్యాంక్ వద్దకు వెళ్లాడు. బ్యాంకు బయట నిలబడి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతుండగా, బ్యాంకు లోపలి నుంచి ఒక అధికారి బయటకు పరిగెత్తుకు వచ్చాడు. ‘నీ కుడివైపుగా దొంగ పారిపోతున్నాడని’ రిపోర్టర్ కు కంగారుగా చెప్పాడు. దీంతో సదరు రిపోర్టర్ ‘ దిస్ ఈజ్ లైవ్ టీవి... నేను వెళ్లాలి.. 911 కు ఫోన్ చెయ్యాలి’ అంటూ ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని ముగించాడు. అసలు విషయమేమిటంటే మంగళవారం నాడు కూడా అదే బ్యాంకులో అదే దొంగ మరోసారి దొంగతనం చేశాడు. ప్రత్యక్ష ప్రసారం వస్తున్న విషయాన్ని దొంగ గమనించకపోవడంతో అతను వీడియోలో దొరికిపోయాడు. బ్యాంకులోపలికి వెళ్లడం, కొద్ది నిమిషాల తర్వాత హడావిడిగా బయటకు రావడం ఇదంతా వీడియోలో రికార్డయింది. దీని ఆధారంగా, రిపోర్టరు ఫిర్యాదు ఆధారంగా నిందితుడు రియన్ లిస్కో(36)ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News