: రేపు హైదరాబాదు చేరుకోనున్న రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాదు చేరుకుంటారు. శీతాకాలం విడిది కోసం ఆయన రేపు హైదరాబాదు వస్తున్నారు. 14 రోజుల పాటు ఆయన హైదరాబాదులో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు చేపట్టిన అయుత చండీయాగంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఉదయం 11 గంటలకు హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు గవర్నర్, పలువురు రాజకీయ ప్రముఖులు స్వాగతం పలకనున్నారు.

  • Loading...

More Telugu News