: సిక్స్ ప్యాక్ చూపించాల్సిన అవసరం రాలేదు: ఆయుష్మాన్ ఖురానా
'నా సినిమాలన్నీ వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటాయి.. కథానుసారంగా సాగుతాయి. కనుక సిక్స్ ప్యాక్ చూపించాల్సిన అవసరం రాలేదు’ అంటున్నాడు బాలీవుడ్ నటుడు, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పాడు. అసలు సిక్స్ ప్యాక్ చూపించే వరకు తాను సినిమాల్లోకి రాకూడదని అనుకున్నానని, అయితే తాను నటించిన సినిమాల్లో అటువంటి అవకాశం లేదని చెప్పాడు. సిక్స్ ప్యాక్ కంటే ఫిట్ నెస్ ముఖ్యమని, మన శరీర తత్వాన్ని అనుసరించి ఆహారం తీసుకోవాలని వికీ డోనర్, దమ్ లాగా కె హైసా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ చెప్పాడు.