: అప్పుడు చిన్నపిల్లను...ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ని!: దీపికా పదుకొనె


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'బాజీరావు మస్తానీ' చిత్రంలో హీరోయిన్ పాత్ర తనను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఎందుకంత ఆశ్చర్యం? అన్న అనుమానం అభిమానులకు తప్పకుండా వస్తుంది. దానికి సమాధానం దీపికా పదుకొనె మాటల్లో...‘నేను స్కూల్లో చదువుకుంటున్న రోజులవి. బాజీరావు మస్తానీ చిత్రాన్ని విభిన్నమైన నటులతో సంజయ్ లీలా భన్సాలి నిర్మించాలనుకుంటున్నారనే వార్తను చదివాను. నటిని కావాలన్న కోరిక అప్పటికి నాలో లేదు. గమ్మత్తేమిటంటే.. నేను నటిని అవ్వడం, ఆ చిత్రంలో నటించే అవకాశం నాకు లభించడం ఎంద యాధృచ్ఛికం! సంజయ్ లీలా భన్సాలీ నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. 2007లో వచ్చిన నా మొదటి చిత్రం 'ఓం శాంతి ఓం' రిలీజు రోజునే భన్సాలీ 'సావరియా' చిత్రం కూడా రిలీజైంది. భన్సాలీ చిత్రాలకు నేను సరిపోయే హీరోయిన్ ని కాదని, నా లాంటి వాళ్లతో ఆయన పని చేయరని ఆ సమయంలో నేను అనుకున్నాను. కట్ చేస్తే..8 సంవత్సరాల తర్వాత..భన్సాలీ తీసిన రెండు చిత్రాల్లో నేను నటించాను’ అని దీపికా పదుకొనె ఒక ఇంటర్వ్యూలో సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News