: పోలీసు కేసుల భయంతో బెంగళూరులో తలదాచుకున్న నలుగురు వైకాపా కార్యకర్తల మృతి!


కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరంతా కడప సమీపంలోని తొండూరు మండలం భద్రంపల్లికి చెందిన వారని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరి పేర్లు చెన్నకేశవ రెడ్డి, మోహన్ రెడ్డి అని సమాచారం. భద్రంపల్లి గ్రామంలోని రేషన్ షాపుల వివాదంతో వీరిపై కేసులు నమోదు కాగా, వీరంతా పారిపోయి బెంగళూరులో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. వీరంతా ఒకేసారి ఎలా మరణించారన్న విషయమై వివరాలు తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News