: వరుణ్ తేజ్ పై ప్రశంసలు కురిపించిన రాంగోపాల్ వర్మ


మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ పై ప్రముఖ నటుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడే 'లోఫర్' సినిమా చూశానని, అద్భుతంగా ఉందని అన్నాడు. నెక్స్ట్ మెగాస్టార్ వరుణ్ తేజేనని వర్మ ప్రకటించాడు. ఇక మెగాస్టార్ హోదా కోసం మిగిలిన మెగా హీరోలు ఆశలు వదిలేసుకోవాలని పేర్కొన్నాడు. 'ముకుంద', 'కంచె', 'లోఫర్' సినిమాలతో వరుణ్ తేజ్ తనను తాను వినూత్నంగా ఆవిష్కరించుకున్నాడని వర్మ అభిప్రాయపడ్డాడు. మ్యూజిక్, డ్రామా, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్లలో ఉన్న సినిమా అని వర్మ ఆకాశానికెత్తాడు. రేవతి, పోసానిల నటన అద్భుతమని చెప్పాడు. చాలా ఏళ్ల తరువాత అద్భుతమైన హీరోయిన్ ను చూశానని పేర్కొన్నాడు. పూరీ జగన్, వరుణ్ తేజ్ పాత్రను చక్కగా తీర్చిదిద్దాడని వర్మ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News