: ఆ దేవాలయంలో దొంగతనం చేస్తే సంతాన ప్రాప్తి!
మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా గ్రామంలోని చూడామణిదేవి అమ్మవారి దేవాలయంలో చిత్రమైన సంప్రదాయం నెలకొంది. ఈ ఆలయంలో దేవతను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే అమ్మవారిని దర్శించుకున్న తరువాత అమ్మవారి పాదాల చెంతనున్న చిన్న చెక్కముక్కను దొంగిలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 1805లో నిర్మించారని, అప్పటి నుంచి ఈ నమ్మకం కొనసాగుతూ వస్తోందని ఆలయకర్తలు వెల్లడించారు.