: కేన్సర్ బాధితుల కోసం 'శ్రీమంతుడు'... 23న 'స్కై ఫెస్ట్'లో ప్రదర్శన


కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజజీవితంలోనూ సినీ నటుడు మహేశ్ బాబు తనవంతు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో కేన్సర్ బాధితుల కోసం ఆయన పని చేస్తున్న 'స్పర్శ్ హాస్పిక్' అనే స్వచ్ఛంద సంస్థకి నిధులు సమీకరించాలని తాజాగా సంకల్పించాడు. ఇందుకోసం హైదరాబాద్ లో ఈ నెల 23 నుంచి 27 వరకు స్పర్శ హాస్పిక్ ఆధ్వర్యంలో 'స్కై ఫెస్ట్' ను ఎంచుకున్నాడు. ఈ ఫెస్ట్ ముగింపు రోజు అర్థరాత్రి తాను నటించిన 'శ్రీమంతుడు' సినిమాను ప్రదర్శించనున్నట్టు మహేశ్ ట్విట్టర్ లో తెలిపాడు. స్పర్శ్ హాస్పిక్ కు అంతా మద్దతు తెలపాలని కోరాడు.

  • Loading...

More Telugu News